Sponsors
Showing posts with label Banks. Show all posts
Showing posts with label Banks. Show all posts
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India)
Monday, February 1, 2010Posted by
INDUSTAN
0 Comments
- భారతీయ రిజర్వ్ బ్యాంక్ 1935 సంవత్సరంలో స్థాపించబడింది.
- భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.
- భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధానకేంద్రం ముంబాయి.
- 1935లో రిజర్వ్ బ్యాంక్ స్థాపించినప్పుడు తాత్కాలిక ప్రధానకేంద్రం కలకత్తా (ప్రస్తుత కోల్‌కత) నగరంలో ఉండేది--.
- భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కేంద్రాల సంఖ్య 22.
- రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్‌గా ఓ.ఏ.స్మిత్ పనిచేశారు--.
- భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన తొలి భారతీయ వ్యక్తి సి.డి.దేశ్‌ముఖ్.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళ కె.జె.ఉదేశి.
- భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ఇంతవరకు గవర్నర్లుగా పనిచేసినవారి సంఖ్య 22.
- 1982 నుండి 1985 వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నరుగా పనిచేసి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించినది మన్‌మోహన్ సింగ్.
ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము---> ఆర్థికశాస్త్రము.
బ్యాంకుల జాతీయీకరణ (Nationalisation of Banks)
Posted by
INDUSTAN
- బారతదేశంలో తొలిసారిగా బ్యాంకుల జాతీయీకరణ 1969 (జూలై 19)చేయబడింది.
- 1969లో 14 బ్యాంకులను జాతీయీకరించారు.
- 1969లో 14 బ్యాంకుల జాతీయీకరణ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగింది.
- 1969లో 14 బ్యాంకులను రూ.50 కోట్ల మూలధనం పైబడి ఉన్న బ్యాంకులు ప్రాతిపదికపై జాతీయీకరించారు.
- 1969 బ్యాంకుల జాతీయీకరణకు రాష్ట్రపతి ఆమోదం 9 ఆగస్టు, 1969 లో లభించింది.
- 1969 తరువాత రెండోసారి దేశంలో బ్యాంకుల జాతీయీకరణ 1980 చేయబడింది.
- 1980లో 6 బ్యాంకులను జాతీయీకరించారు--.
- బ్యాంకుల జాతీయీకరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వాణిజ్య బ్యాంకులు ఇచ్చే పరపతిపై ప్రభుత్వ నియంత్రణ కోరకు.
- 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైనది.
- ప్రస్తుతం దేశంలో జాతీయ బ్యాంకుల సంఖ్య 19.
Subscribe to:
Posts (Atom)
