Showing posts with label Economics. Show all posts
Showing posts with label Economics. Show all posts

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India)


  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ 1935 సంవత్సరంలో స్థాపించబడింది.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధానకేంద్రం ముంబాయి.
  • 1935లో రిజర్వ్ బ్యాంక్ స్థాపించినప్పుడు తాత్కాలిక ప్రధానకేంద్రం కలకత్తా (ప్రస్తుత కోల్‌కత) నగరంలో ఉండేది--.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కేంద్రాల సంఖ్య  22.
  • రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్‌గా ఓ.ఏ.స్మిత్  పనిచేశారు--.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన తొలి భారతీయ వ్యక్తి  సి.డి.దేశ్‌ముఖ్.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళ కె.జె.ఉదేశి.
  • భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ఇంతవరకు గవర్నర్లుగా పనిచేసినవారి సంఖ్య 22.
  • 1982 నుండి 1985 వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నరుగా పనిచేసి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించినది    మన్‌మోహన్ సింగ్.

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము---> ఆర్థికశాస్త్రము.

బ్యాంకుల జాతీయీకరణ (Nationalisation of Banks)

  • బారతదేశంలో తొలిసారిగా బ్యాంకుల జాతీయీకరణ 1969 (జూలై 19)చేయబడింది.
  • 1969లో 14 బ్యాంకులను జాతీయీకరించారు.
  • 1969లో 14 బ్యాంకుల జాతీయీకరణ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగింది.
  • 1969లో 14 బ్యాంకులను రూ.50 కోట్ల మూలధనం పైబడి ఉన్న బ్యాంకులు ప్రాతిపదికపై జాతీయీకరించారు.
  • 1969 బ్యాంకుల జాతీయీకరణకు రాష్ట్రపతి ఆమోదం 9 ఆగస్టు, 1969 లో లభించింది.
  • 1969 తరువాత రెండోసారి దేశంలో బ్యాంకుల జాతీయీకరణ 1980 చేయబడింది.
  • 1980లో 6 బ్యాంకులను జాతీయీకరించారు--.
  • బ్యాంకుల జాతీయీకరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వాణిజ్య బ్యాంకులు ఇచ్చే పరపతిపై ప్రభుత్వ నియంత్రణ కోరకు.
  • 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైనది.
  • ప్రస్తుతం దేశంలో జాతీయ బ్యాంకుల సంఖ్య  19.
ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము -----> ఆర్థికశాస్త్రము.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (International Monetary Fund)

  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ1946 (డిసెంబరు 27, 1945న వ్యవస్థీకరించబడినది). సంవత్సరంలో ఏర్పడింది.
  • IMF ముఖ్య ఆశయం--మారకపు విలువ స్థిరీకరణ, అంతర్జాతీయ చెల్లింపులు సాఫీగా జరిగేటట్లు చూడటం.
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రధాన స్థావరం వాషింగ్టన్ (అమెరికా).నగరంలో ఉంది.
  • ప్రస్తుతం IMFలో 186 సభ్యదేశాల సభ్యత్వం కలిగిఉన్నవి. 
  • IMF మరియు ప్రపంచబ్యాంకు (IBRD) లను కలిపి బ్రెట్టన్‌వుడ్స్ కవలలుగా సంబోధిస్తారు.
  • 1945లో తొలిసారిగా IMF ఒప్పందంపై సంతకాలు 29 దేశాల చేసినవి. 
  • IMFలో అమెరికా (17%) దేశం వాటా అధికంగా ఉంది .
  • IMFలో భారతదేశం(1.9%) వాటా ఉంది. 
  • IMF ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్  డొమినిక్ స్ట్రాస్‌కాన్ (ఫ్రాన్సు).
  • IMF తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా కామిల్లెగట్ (బెల్జియం) వ్యవహరించారు.