బ్యాంకుల జాతీయీకరణ (Nationalisation of Banks)

Monday, February 1, 2010

  • బారతదేశంలో తొలిసారిగా బ్యాంకుల జాతీయీకరణ 1969 (జూలై 19)చేయబడింది.
  • 1969లో 14 బ్యాంకులను జాతీయీకరించారు.
  • 1969లో 14 బ్యాంకుల జాతీయీకరణ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగింది.
  • 1969లో 14 బ్యాంకులను రూ.50 కోట్ల మూలధనం పైబడి ఉన్న బ్యాంకులు ప్రాతిపదికపై జాతీయీకరించారు.
  • 1969 బ్యాంకుల జాతీయీకరణకు రాష్ట్రపతి ఆమోదం 9 ఆగస్టు, 1969 లో లభించింది.
  • 1969 తరువాత రెండోసారి దేశంలో బ్యాంకుల జాతీయీకరణ 1980 చేయబడింది.
  • 1980లో 6 బ్యాంకులను జాతీయీకరించారు--.
  • బ్యాంకుల జాతీయీకరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వాణిజ్య బ్యాంకులు ఇచ్చే పరపతిపై ప్రభుత్వ నియంత్రణ కోరకు.
  • 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైనది.
  • ప్రస్తుతం దేశంలో జాతీయ బ్యాంకుల సంఖ్య  19.
ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము -----> ఆర్థికశాస్త్రము.

0 comments: