- శ్రీహరికోట ప్రయోగ కేంద్రం ఏ జిల్లాలో ఉంది--నెల్లూరు జిల్లా.
- శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-1ను ప్రయోగించు రాకెట్--PSLV C-11.
- శ్రీహరికోట ప్రయోగకేంద్రం ప్రస్తుత నామం--సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం.
- శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన తొలి రాకెట్--SLV-3 (1979లో).
- శ్రీహరికోట నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన రాకెట్ల సంఖ్య--26 (PSLV c-11 27వది).
- 2008 ఏప్రిల్‌లో ఒకే సారి 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్ళిన రాకెట్--PSLV C-9.
- శ్రీహరికోట నుంచి ఇప్పటివరకు ప్రయోగించిన 26 రాకెట్‌లలో ఎన్ని సఫలమైనవి--21 (5 విఫలం).
- శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా నామకరం ఎప్పుడు చేశారు--2002, సెప్టెంబర్ 5.
- షార్ ఏర్పాటు కాకమునుపు భారత అంతరిక్ష పరిశోధనలు ఎక్కడ జరిగేవి--కేరళ లోని తిరువనంతపురంలో.
- శ్రీహరికోట భూమధ్యరేఖకు ఉత్తరాన ఎన్ని డిగ్రీల అక్షాంశంపై ఉంది--13 డిగ్రీల అక్షాంశం.
|