భారతదేశం రాష్ట్రాలు

Wednesday, February 3, 2010

ప్రధాన వ్యాసము: భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశము 28 రాష్ట్రాలుగా విభజించబడినది. (రాష్త్రములు కొన్నిజిల్లాలుగా విభజించబడినవి), ఆరు కేంద్రపాలిత ప్రాంతములు మరియు జాతీయ రాజధాని ప్రాంతము,ఢిల్లీ. రాష్ట్రాలకు స్వంత ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.
భారతదేశ రాష్ట్రాలు.

భారత రాజ్యాంగము (Constitution of India)

  • భారత రాజ్యాంగము జనవరి 26, 1950 అమలులోకి వచ్చింది.
  • భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల 395.
  • భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినదిఐవర్ జెన్నింగ్స్.
  • భారత రాజ్యాంగము యొక్క చిహ్నంఏనుగు.
  • భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం పూర్ణస్వరాజ్ దినం.
  • భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు పీఠిక (ప్రియాంబుల్) వివరించబడ్డాయి.
  • భారత రాజ్యాంగమును భారత రాజ్యాంగ పరిషత్తు రచించారు.
  • భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.
  • భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము.
  • భారత రాజ్యాంగము నవంబరు 26, 1949 రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India)


  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ 1935 సంవత్సరంలో స్థాపించబడింది.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధానకేంద్రం ముంబాయి.
  • 1935లో రిజర్వ్ బ్యాంక్ స్థాపించినప్పుడు తాత్కాలిక ప్రధానకేంద్రం కలకత్తా (ప్రస్తుత కోల్‌కత) నగరంలో ఉండేది--.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కేంద్రాల సంఖ్య  22.
  • రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్‌గా ఓ.ఏ.స్మిత్  పనిచేశారు--.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన తొలి భారతీయ వ్యక్తి  సి.డి.దేశ్‌ముఖ్.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళ కె.జె.ఉదేశి.
  • భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ఇంతవరకు గవర్నర్లుగా పనిచేసినవారి సంఖ్య 22.
  • 1982 నుండి 1985 వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నరుగా పనిచేసి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించినది    మన్‌మోహన్ సింగ్.

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము---> ఆర్థికశాస్త్రము.

బ్యాంకుల జాతీయీకరణ (Nationalisation of Banks)

  • బారతదేశంలో తొలిసారిగా బ్యాంకుల జాతీయీకరణ 1969 (జూలై 19)చేయబడింది.
  • 1969లో 14 బ్యాంకులను జాతీయీకరించారు.
  • 1969లో 14 బ్యాంకుల జాతీయీకరణ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగింది.
  • 1969లో 14 బ్యాంకులను రూ.50 కోట్ల మూలధనం పైబడి ఉన్న బ్యాంకులు ప్రాతిపదికపై జాతీయీకరించారు.
  • 1969 బ్యాంకుల జాతీయీకరణకు రాష్ట్రపతి ఆమోదం 9 ఆగస్టు, 1969 లో లభించింది.
  • 1969 తరువాత రెండోసారి దేశంలో బ్యాంకుల జాతీయీకరణ 1980 చేయబడింది.
  • 1980లో 6 బ్యాంకులను జాతీయీకరించారు--.
  • బ్యాంకుల జాతీయీకరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వాణిజ్య బ్యాంకులు ఇచ్చే పరపతిపై ప్రభుత్వ నియంత్రణ కోరకు.
  • 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైనది.
  • ప్రస్తుతం దేశంలో జాతీయ బ్యాంకుల సంఖ్య  19.
ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము -----> ఆర్థికశాస్త్రము.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (International Monetary Fund)

  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ1946 (డిసెంబరు 27, 1945న వ్యవస్థీకరించబడినది). సంవత్సరంలో ఏర్పడింది.
  • IMF ముఖ్య ఆశయం--మారకపు విలువ స్థిరీకరణ, అంతర్జాతీయ చెల్లింపులు సాఫీగా జరిగేటట్లు చూడటం.
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రధాన స్థావరం వాషింగ్టన్ (అమెరికా).నగరంలో ఉంది.
  • ప్రస్తుతం IMFలో 186 సభ్యదేశాల సభ్యత్వం కలిగిఉన్నవి. 
  • IMF మరియు ప్రపంచబ్యాంకు (IBRD) లను కలిపి బ్రెట్టన్‌వుడ్స్ కవలలుగా సంబోధిస్తారు.
  • 1945లో తొలిసారిగా IMF ఒప్పందంపై సంతకాలు 29 దేశాల చేసినవి. 
  • IMFలో అమెరికా (17%) దేశం వాటా అధికంగా ఉంది .
  • IMFలో భారతదేశం(1.9%) వాటా ఉంది. 
  • IMF ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్  డొమినిక్ స్ట్రాస్‌కాన్ (ఫ్రాన్సు).
  • IMF తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా కామిల్లెగట్ (బెల్జియం) వ్యవహరించారు.

తెలుగు ప్రజలారా (సమాఖ్య వాదులారా) ఇది ఒకసారి చదవండి


ఇన్నిరోజులు చిన్న రాష్ట్రాల ద్వార అభివృద్ధి సాధ్యపడదు అని అర్థం పర్థం లేని వాదన చేసిన ఆంధ్రా/సీమ ప్రజలారా ఒక్కసారి ఈరోజు (8th Jan, 2010) వార్తా పేపర్లో వచ్చిన ఈ కథనాన్ని చదివి తెలివి తెచ్చుకోండి. "అద్భుతమైన ప్రగతి" ని సాధిస్తున్న చిన్న రాష్ట్రాల గొప్పతనాన్ని ఒక్క సారి చూడండి.
  

తెలంగాన పై ఆంధ్ర యునివర్సిటీ ఆద్యాపకుని వ్యాసం

ఆంధ్రాలో ఉన్న కొంతమంది తెలివిగల మేధావులు తెలంగాణకు అనుకూలమ్ గా ఉన్నారన్నదానికి సాక్ష్యమ్ ఈరోజు వార్త పేపర్లో వచ్చిన ఈ వ్యాసమ్.
తెలివిలేకున్నా.....కనీసమ్ చదివి తెలివి తెచ్చుకోండి. బాగుపడతారు. ఎప్పుడు పక్కోడిమీదవడి దోసుకోవడమ్ గాదు స్వతంత్రంగా బ్రతికి మీ ఆత్మ గోరవమ్ (ఉంటే) నిలుపుకోండి.

శ్రీ హరి కోట ప్రయోగ కేంద్రం (SHAR)

శ్రీ హరి కోట ప్రయోగ కేంద్రం (SHAR)
  • శ్రీహరికోట ప్రయోగ కేంద్రం ఏ జిల్లాలో ఉంది--నెల్లూరు జిల్లా.
  • శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-1ను ప్రయోగించు రాకెట్--PSLV C-11.
  • శ్రీహరికోట ప్రయోగకేంద్రం ప్రస్తుత నామం--సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం.
  • శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన తొలి రాకెట్--SLV-3 (1979లో).
  • శ్రీహరికోట నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన రాకెట్ల సంఖ్య--26 (PSLV c-11 27వది).
  • 2008 ఏప్రిల్‌లో ఒకే సారి 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్ళిన రాకెట్--PSLV C-9.
  • శ్రీహరికోట నుంచి ఇప్పటివరకు ప్రయోగించిన 26 రాకెట్‌లలో ఎన్ని సఫలమైనవి--21 (5 విఫలం).
  • శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా నామకరం ఎప్పుడు చేశారు--2002, సెప్టెంబర్ 5.
  • షార్ ఏర్పాటు కాకమునుపు భారత అంతరిక్ష పరిశోధనలు ఎక్కడ జరిగేవి--కేరళ లోని తిరువనంతపురంలో.
  • శ్రీహరికోట భూమధ్యరేఖకు ఉత్తరాన ఎన్ని డిగ్రీల అక్షాంశంపై ఉంది--13 డిగ్రీల అక్షాంశం.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మరిన్ని విశేషాలకోసం ---ఆంధ్రప్రదేశ్